మానవతావాది, తాత్విక చింతన కలవారు, అలుపెరుగని శ్రమజీవి, "మావవత" వ్యవస్థాపకులు
శ్రీ ఎన్.రామచంద్రారెడ్డి స్వస్థలం బండపల్లి గ్రామం, రాయచోటి మండలం, వై.ఎస్.ఆర్. జిల్లా, రెడ్డి గారు 1975 లో లెక్చరర్ గా చేరి, 2004-2008 సంవత్సర ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రిన్సిపాల్ గా బాథ్యతలు నిర్వర్తించి కళాశాలను రాష్ర్ట, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు.

ప్రమాదాలలో చిక్కిన వారిని రక్షించుట కొరకై 108 ప్రభుత్వ సేవలు రాకపూర్వమే వందాలదిమంది ప్రాణాలను కాపాడటానికి ఉత్తమ సంస్థ "మావవత" ను 2004 సం.లో స్థాపించారు.

వీరి శ్రీమతి రాజేశ్వరి. వీరి సంతానము.. కుమారుడు రాజశేఖరరెడ్డీ ఎం.సి.ఎ., కోడలు అనిత బి.టెక్.(పూనె), కుమార్తె డా. లావ్యణ, డి.సి.హెచ్., అల్లుడు కరుణాకరరెడ్డీ, ఎం.డి (పీడియాట్రీ) అశ్విని చిల్ద్రన్స్ హాస్పటల్, కడప.

మానవత గురించి


మానవాళికి మహోపకారము చేయు ఉత్తమ సంస్థ మానవత. మావవత సంస్థ 2004 సం.లో జంగారెడ్డీగుడెం ప.గో. జిల్లాలో ఆవిర్భావం చెందినది.108 మంది సభ్యులతొ ప్రారంభించి మావవత సంస్థ నేటికి మన జిల్లాలో 30 మండలాలలో 9000 మంది సభ్యులతో నిరంతర సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రమాదాలలో చిక్కిన అభాగ్యుల జీవితాలలో ఆశాజ్యోతిని వెలిగించుచున్నది.

మానవత ప్రార్ధన


భగవంతుని సృష్టి లొ జాతి, మత, కుల, ప్రాంతీయ వయో బేధములకు అతీతంగా సర్వ మానవాళి ఆకలి తీరాలని, వివేకవంతులైన మానవులకు ఆకలితొ పాటు కనీస అవసరాలు సయితం తీరాలని , ప్రతి మానవ జీవితం శాంతి , ప్రేమ , ఆనందముల చేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణం చెందాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము. • శాంతిరథం

  పార్ధివ శరీరమును తరలించుటకు ఉచిత వాహనము,ప్రస్తుతము జిల్లావ్యాప్తంగా ఏడు శాంతిరథములు సేవలు అందించుచున్నవి....
 • దుఃఖ సమయ౦లో మన వ౦తు సహకారము

  తమ వారలు చనిపోయినపుడు కడసారి చూపుకు నోచుకొనుటకు వీలుగా వారికి ఉచితముగా మొబైల మార్చురీ ఫ్రిజర్ ను అందించుచున్నాము....
 • పేదరిక౦, ప్రమాదాలు

  ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులలో అవసరమైన వారికి మానవత సంస్థ ద్వారా ఆర్ధిక సహాయం అందించుట....
 • ప్రతిభావ౦తులైన విద్యార్ధులు

  ప్రతిభ మరియు పేదవిద్యార్ధులకు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించుటకు వీలుగా వారికి ఆర్ధిక, నైతిక సహకారం అందించుట....